కొందరు పైకి ఎంత నిజాయితీపరులుగా కనిపిస్తారు. వారి లోగుట్టు మాత్రం పెరుమాళ్ళకే తెలియాలి. నేను మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజి గుడికి బస్సు లో వెళుతున్నప్పుడు నా కళ్ళ ముందర జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా వ్రాసిన ఈ కథ "పెరుమాళ్ళకెరుక" ఈ నెల ధర్మశాస్త్రం మాసపత్రికలో ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో.. ఈ చిన్న కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. ఆగిఆగడంతోనే జనాలు బస్సు ను చుట్టుముట్టారు. బస్సు దిగి " కాళీ మందిర్..బాలాజీ టెంపుల్.. కాళీ మందిర్..చిలుకూరు...
అబ్బయ్యా..అక్కా. . మా బడికాడి కుందేళ్ళ మందల చెప్తానన్నా కదా. మరి ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో "ఆనంద భైరవి" కత చదవండి. మీకు తెలస్తది. అట్నే నన్ను ప్రోత్సహిస్తున్న శ్రీ కోసూరి రత్నం సారుకి, శ్రీ ఈతకోటసుబ్బారావు సారుకి ధన్నివాదాలు. కతని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు చెప్తారుగా రాత్రి తొమ్మిదైంది. ఆ పొయిలప్పుడు మోహనన్న ఫ్రెండ్ మురళి ఇంటికొచ్చాడు. పంచలో చేరి ఇద్దరు గుసగుసలాడుకుంటా ఉండారు. అమ్మ కుంపట్లో బొగ్గుల మీద నీళ్ళు చల్లి ఆర్పతా ఉండాది. నాయన...
అబ్బయ్య, అమ్మి ..మూడేళ్ళ పసివాడు "సునీలు ఏమయ్యాడో" . ఆ మందల తెలియాలంటే మీరు ఓ తూరి నెల్లూరు విజయమహల్ సెంటర్ కాడికి వెళ్లాల్సిందే మరి.. విశాలాక్షి మాసపత్రిక జూన్ 2021 సంచికలో.. "బాటలకు ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి …. " ఆఖరి ఖాళీలో "అశోకుడు" అని రాసి "అమ్మయ్య" అనుకున్నా. క్లాసులో ఎనక కూర్చొని రాస్తావున్న ఆ అమ్మి హిమబిందు మెల్లగా " రాసేసావా. అయిపోయిందా" అంటా సైగ చేసింది. రాసేశా అంటా తలవూపినా. యూనిట్ పరీక్షల్లో ఆఖరి సోషల్ పరీక్షా...
"సాహో" మాసపత్రికలో జూన్ నెల "అందమే ఆనందం" తో మీ ముందుకు. "అందానికి అందానివై, ఏనాటికి నా దానవై నా ముందర నిలిచిన దాన నా దాన" దిగ్విజయంగా మొదలైన మన "సాహూ " పత్రిక తిరుగులేని సాహితి ఉద్యానవనంగా విలసిల్లాలని, ముందుగా సాహూకి అభినందనలు తెలియచేసుకుంటూ..మన అందాల శీర్షిక రెండో సంచికలోకి అడుగిడింది. ప్రపంచంలో అత్యంత అందమైన వారు ఎవరు అంటే ముందుగా "మదర్ థెరెసా " పేరు చెప్తాను నేను. హృదయపు లోతుల్లో ఉండే స్వచ్ఛత, ఆనందం అందంగా పరిణమించి ముఖం...
కరోనా కరోనా అంటూ ఎప్పుడూ భయపడడం, బాధ పడడమేనా. ధైర్యమే మన ఆయుధం. కాస్త రిలాక్స్ కోసం ఈ రోజు నా కథ "అందమైన గాజులు" చదవండి మిత్రులారా. ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో. బడి కాడనించి వస్తానే పుస్తకాల పెట్టిని మంచం మీదకు ఇసిరేసి అమ్మ ఇచ్చిన మురుకులు తింటా ఉన్నాను. కానీ నా మనసంతా వీధిలోనే ఉంది. ఆడుకునేదానికి వస్తామన్నారు సునీతా, రాధా. గబా గబా తినేసి అమ్మ పిలస్తా ఉన్నా ఆగకుండా ఇంటి వాకిలి తలుపు తీసుకుని ప్రహరీ...
నమస్తే. ప్రింట్ పత్రికలు ఒక్కొక్కటీ మాయమౌతున్నఈ గడ్డు పరిస్థితుల్లో పాఠకులకు మంచి సాహిత్యం అందించాలనే సుదృక్పధంతో ప్రముఖ కథ, నవలా రచయిత శ్రీ ఇందు రమణ గారు "సాహో" సాహితీ పత్రికను ప్రారంభించారు. ఈ తరుణంలో పత్రికా నిర్వహణ గొప్ప సాహసమే అనుకోవాలి. ముందుగా శ్రీ ఇందు రమణ గారికి హృదయపూర్వక అభినందనలు. సాహో పత్రిక అంచెలంచెలుగా ఎదుగుతూ, సాహితీ లోకంలో మేటి పత్రికగా నిలవాలని కోరుకుంటున్నాను. సాహూ పత్రిక కోసం నేను సైతం "అందమే ఆనందం" శీర్షికను నిర్వహించడం నాకో గొప్ప...

సరంగు

"ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడుతాడు" లాంటి నానుడులు, సామెతలతో పుచ్చిపోయిన సమాజంలో ఓ సగటు ఆడది గడప దాటి ఎందుకు రావలసివచ్చింది, వచ్చి ఎలాంటి విజయం సాధించింది తెలిపే కథ "సరంగు". ఈ నెల "సాహిత్య ప్రస్థానం " ఏప్రిల్ 2021 సంచికలో. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా... ఆకాశమంత విశాలమైన హృదయం, భూమికి ఉన్నంత సహనం ఉండాలంటారు ఆడదానికి. కానీ రోజు రోజుకి మారుతున్న మా పరిస్థితులు నా సహనానికి పరీక్ష పెడుతున్నాయి.మా వారు చేసే వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు...
"వొజ్రం ఇలువ " విజయమహల్ సెంటర్ కథల్లో మొదటికథ మన విశాలాక్షి ఏప్రిల్ 2021 సంచికలో వచ్చేసిందండి. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ని తెలుపుతారుగా. స్టీలు పెట్టెలో పుస్తకాలు సర్దుకుంటా ఉన్నా. కాస్త చిరుగులు ఉన్న పడక కుర్చీ పట్టను దబ్బనం, పురికోస తాడుతో కుడతాఉన్నాడు నాయన. పంచ లో కొళాయి గుంట కాడ అంట్లు తోమతా ఉండాది సుబ్బి."లోకాలయ్య.. ఇదిగో ఈ ఇడ్లీలు తీనేసి బడికి పో"అన్నాది అమ్మ సిబ్బిరేకులో మూడు ఇడ్లీలు, ఇంత టెంకాయ చట్నీ యేసి నా...

చెల్లె

నమస్తే. శ్రీమతి కల్వకుంట కవిత గారి సంపాదకత్వంలో ప్రతిష్టాత్మకంగా వెలువడుతున్న తెలంగాణ జాగృతి తెలుగు సాహిత్య పక్షపత్రిక "తంగేడు" మార్చి 01-15, 2021 మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో నా కథ "చెల్లె " ప్రచురితం అవడం చాలా ఆనందం. శ్రీమతి కల్వకుంట కవిత గారికి, అసోసియేట్ ఎడిటర్ డా|| కాంచనపల్లి గో.రా. గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపుతారుగా.. సుల్తాన్పూర్ బస్టాప్ నిర్మానుష్యంగా ఉండే. అర్థగంట నుంచి చూస్తున్న...

దమనం

మిత్రులకు నమస్తే. మనుషుల జీవితంలో, వారి పసితనంలో జరిగిన విషాద సంఘటనలు, లేదా ఇష్టం లేని విషయాలు మనసు పొరల్లో మారుమూలకు నెట్టివేయబడతాయి. వారు పెరిగే క్రమంలో తిరిగి అలాంటి సంఘటనలు లేదా అప్పటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే నేపథ్యంలో రాసిన ఈ కథ "దమనం" విశాలాక్షి మాసపత్రిక వారి సంక్రాతి కథల పోటీ విజేతల కథల సంపుటిలో ప్రచురితం అయింది. ఈ కథల పోటీని మా అమ్మ జ్ఞాపకార్ధం "అరిశా ఆదిలక్షమ్మ స్మారక కథల...
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.